Sushant Singh Rajput: రోడ్డు ప్రమాదంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం

Tragedy in Sushant family after six family members killed in road accident
  • ఇటీవల ఐపీఎస్ అధికారి ఓంప్రకాశ్ సోదరి మృతి
  • బీహార్ లోని లఖిసరాయ్ లో అంత్యక్రియలు
  • ఓంప్రకాశ్ తో సుశాంత్ కుటుంబానికి బంధుత్వం
  • అంత్యక్రియలకు హాజరై వస్తుండగా ఘటన
  • మృతుల్లో సుశాంత్ బావ, మేనల్లుడు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య ఆయన కుటుంబంలో ఎంత విషాదం నింపిందో తెలిసిందే. తాజాగా సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సుశాంత్ కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు నేడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  

హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ సింగ్... సుశాంత్ సింగ్ కు బంధువు అవుతారు. అయితే ఓం ప్రకాశ్ సింగ్ సోదరి మృతి చెందగా, బీహార్ లోని లఖిసరాయ్ లో ఆమె అంత్యక్రియలకు సుశాంత్ కుటుంబానికి చెందినవారు కూడా హాజరయ్యారు. వారు పాట్నా తిరిగివస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

వారు ప్రయాణిస్తున్న సుమో వాహనం ఓ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమో వాహనంలో సుశాంత్ బావ, మేనల్లుడు, ఇతర బంధువులు కలిసి 10 మంది ఉన్నారు. ఆరుగురు మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
Sushant Singh Rajput
Family Members
Road Accident
Bihar

More Telugu News