Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కు 'కర్ణాటక రత్న' పురస్కారం ప్రకటించిన ప్రభుత్వం

Karnataka govt announced Karnataka Ratna for late Puneeth Rajkumar
  • ఇటీవల మరణించిన పునీత్ 
  • గుండెపోటుతో కన్నుమూత
  • ఇప్పటికీ విషాదంలో కుటుంబ సభ్యులు, అభిమానులు
  • మరణానంతర అవార్డుపై ట్వీట్ చేసిన సీఎం బొమ్మై
దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పునీత్ కు ప్రతిష్ఠాత్మక 'కర్ణాటక రత్న' పురస్కారం ప్రకటిస్తున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు మరణానంతర అవార్డుపై ట్వీట్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ గత నెలలో హఠాన్మరణం చెందడం తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదానికి గురిచేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Puneeth Rajkumar
Karnataka Ratna
CM Basavaraj Bommai
Karnataka

More Telugu News