Madhusudhana Chary: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారిని ఖరారు చేసిన కేసీఆర్
- రాజ్ భవన్ కు ఫైలును పంపిన కేబినెట్
- కాసేపట్లో గవర్నర్ సంతకం చేసే అవకాశం
- గతంలో కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించిన ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారి పేరును ఆయన ఖరారు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తెలంగాణ కేబినెట్ ప్రతిపాదన పంపింది. ఈ ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేస్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోతారు. ఈ మధ్యాహ్నంలోగానే ఈ ఫైల్ పై గవర్నర్ సంతకం చేస్తారని తెలుస్తోంది.
కాగా, ఇంతకుముందు కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫైలును గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టారు. దీంతో, గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారిని ప్రభుత్వం ప్రతిపాదించింది. మధుసూదనాచారి గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన సంగతి తెలిసిందే.