Roja': ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది: రోజా

Roja opines on Chandrababu crying in press meet

  • అసెంబ్లీ నుంచి చంద్రబాబు వాకౌట్
  • సీఎం అయిన తర్వాత వస్తానని శపథం
  • ప్రెస్ మీట్లో వెక్కి వెక్కి ఏడ్చిన బాబు
  • గతంలో ఎంతోమందిని ఏడ్పించాడన్న రోజా
  • అందరి ఉసురు తగిలిందని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశంలో భోరున విలపించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. విధి ఎవరినీ విడిచిపెట్టదని, అందరి సరదా తీర్చుతుందని అన్నారు.

"చంద్రబాబూ... నాడు 72 ఏళ్ల ఎన్టీఆర్ ను ఎంత ఏడ్పించావో గుర్తుందా? ఇప్పుడు 71 సంవత్సరాల 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని అందుకే అంటారు. ఇవాళేదో నీ భార్యను అన్నారని తెగ బాధపడిపోతున్నావు. కానీ నాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూఫిలింస్ లో నటించిందంటూ పీతల సుజాతతో మీడియా పాయింట్ లో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? అంటే మాకు ఓ కుటుంబం లేదు, మాకు పిల్లలు లేరు, మాకు గౌరవం లేదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైనా ఏదైనా అంటావా?

విజయమ్మను ఎంత ఏడ్పించావు, భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు, షర్మిలమ్మను ఎంత వేదనకు గురిచేశావో ఎవరూ మర్చిపోలేదు. ఈరోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడిస్తే నీపై ఎవరూ జాలిపడరు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీపైనా, ఇతరులపైనా సోషల్ మీడియాలో ఎంత తప్పుడు ప్రచారం చేశావో అందరికీ తెలుసు.

చంద్రబాబునాయుడూ.... ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళ అని కూడా చూడకుండా, గతంలో మీకోసం పదేళ్లు పనిచేసిన మహిళా నేత అని కూడా చూడకుండా నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా నన్ను ఏడాది పాటు సస్పెండ్ చేశావు. మహిళా పార్లమెంటుకు పిలిచి 24 గంటల పాటు నన్ను నిర్బంధించి, హైదరాబాదులో నన్ను విసిరిపారేశారు. ఇవన్నీ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోరు.

నువ్వు ఏడ్పించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఇవాళ నీకు తగిలింది. అందరి ఉసురు తగిలి నువ్వు ఇలా అయిపోయావు. నన్ను రూల్స్ కు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేయించగలిగావు... కానీ నిన్ను దేవుడు రెండున్నరేళ్లు కాదు, జీవితంలో మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ నువ్వే శపథం చేసుకునేలా చేశాడు. బై బై బాబూ బై బై!" అంటూ రోజా వ్యంగ్యం ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News