Jennifer Lopez: నాలుగో పెళ్లికి సిద్ధమైన పాప్ సింగర్

Jennifer Lopez set to marry fourth time
  • ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న జెన్నిఫర్ లోపెజ్
  • బెన్ అఫ్లెక్ తో ప్రేమాయణం
  • త్వరలోనే పెళ్లి
  • లోపెజ్ వయసు 52 సంవత్సరాలు
'ఇఫ్ యూ హ్యాడ్ మై లవ్' అనే హుషారైన గీతంలో సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్... ఆ తర్వాత 'వెయిటింగ్ ఫర్ టునైట్' అంటూ కుర్రకారును గిలిగింతలు పెట్టింది. గాయనిగా మాత్రమే కాదు నటిగానూ జెన్నిఫర్ లోపెజ్ హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మనీ ట్రైన్, అనకొండ, ది వెడ్డింగ్ ప్లానర్, మెయిడ్ ఇన్ మన్ హటన్, మాన్ స్టర్ ఇన్ లా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది.

అయితే, జెన్నిఫర్ లోపెజ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు కనిపిస్తాయి. ఆమె ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎప్పటికీ తాను రొమాంటిక్ అని చెప్పుకునే జెన్నిఫర్ లోపెజ్ తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నారన్న వార్త ప్రపంచాన్ని చుట్టేస్తోంది. నటుడు బెన్ అఫ్లెక్ ను పెళ్లాడుతున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి లోపెజ్, బెన్ అఫ్లెక్ 2002లోనే డేటింగ్ చేశారు. వారిద్దరికీ అప్పట్లోనే నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ 2004లో వారు చెరో దారి చూసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు వారి మధ్య ప్రేమ చిగురించింది. లోపెజ్ తన మూడో భర్త మార్క్ ఆంటోనీకి 2014లోనే గుడ్ బై చెప్పేసింది. త్వరలోనే క్రిస్మస్ పండుగ రానున్న నేపథ్యంలో తన నాలుగో పెళ్లి వార్తను జెన్నిఫర్ లోపెజ్ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

జెన్నిఫర్ లోపెజ్ 1997లో ఒజాని నోవాను పెళ్లాడి ఏడాదికే విడిపోయింది. ఆ తర్వాత క్రిస్ జూడ్ ను 2001లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి రెండేళ్ల తర్వాత విచ్ఛిన్నమైంది. ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ వయసు 52 ఏళ్లు. మార్క్ ఆంటోనీ ద్వారా ఆమెకు ఇద్దరు కవల పిల్లలు కలిగారు.
Jennifer Lopez
Ben Afleck
Marriage
Hollywood
Pop Singer

More Telugu News