Raj Rarun: 'అనుభవించు రాజా' పచ్చడన్నం వంటి సినిమా!
- కథ వినగానే నాకు నచ్చేసింది
- రాజ్ తరుణ్ కి తగిన రోల్
- నేటివిటీకి కనెక్ట్ అవుతారు
- పెద్దవంశీ సినిమాలా ఉంటుందన్న సుప్రియ
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. ఈ సినిమాతో తెలుగు తెరకి కొత్త కథానాయిక పరిచయమవుతోంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నిర్మాత యార్లగడ్డ సుప్రియ మాట్లాడారు.
"అన్నపూర్ణ బ్యానర్ పై సినిమా అంటే .. ఆ కథలు నేనే వింటాను. కథ నాకు నచ్చితేనే ముందుకు వెళతాను. అలా నాకు నచ్చడం వలన చేసిన సినిమానే ఇది. ఈ కథ వింటున్నప్పుడే నాకు రాజ్ తరుణ్ గుర్తొచ్చాడు. ఆయన అయితేనే సరిగ్గా సరిపోతాడని అనిపించింది. ఆయన తాలూకు వెటకారం ఈ పాత్రకి అవసరం.
ఈ సినిమాను చూస్తుంటే పెద్ద వంశీగారి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ మధ్య కాలంలో మన కథల్లో నేటివిటీ మిస్ అవుతున్నాం. మన ఊరు .. మన వాతావరణం .. మన భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఈ కథలో కనిపిస్తాయి. చూసిన ప్రతిఒక్కరికీ ఇది ఒక పచ్చడన్నం వంటి సినిమా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు.