India: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు
- నిన్న దేశవ్యాప్తంగా 313 మంది మృతి
- కొవిడ్‌తో ఇప్పటి వరకు 4,65,662 మంది కన్నుమూత
- 536 రోజులకు పడిపోయిన యాక్టివ్ కేసులు
దేశంలో మొన్నటితో పోలిస్తే నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 10,488 కొత్త కేసులు వెలుగు చూశాయి. 313 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 4,65,662కు పెరిగింది. మరోవైపు, రికవరీలు మాత్రం బాగా పెరుగుతున్నాయి.
నిన్న 12,329 మంది కరోనా నుంచి బయటపడ్డారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లు దాటింది. ఈ స్థాయిలో రికవరీలు పెరగడం గతేడాది మార్చి తర్వాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. ఇవి 0.36 శాతానికి తగ్గి 536 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం 1,22,714 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 10,74,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.