CM Jagan: అంబులెన్స్ కు దారివ్వండి... కాన్వాయ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్
- హైదరాబాదులో పోచారం మనవరాలి పెళ్లి
- హాజరైన సీఎం జగన్
- కాన్వాయ్ వెళుతుండగా అంబులెన్స్ ను గుర్తించిన సీఎం
- కాన్వాయ్ వేగం తగ్గించాలని అధికారులకు సూచన
- సాఫీగా ముందుకెళ్లిన అంబులెన్స్
సీఎం జగన్ ఇవాళ హైదరాబాదులో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. కాగా, తన కాన్వాయ్ వేగంగా వెళుతుండగా సీఎం జగన్ రోడ్డుపై ఓ అంబులెన్స్ ను గుర్తించారు. వెంటనే వేగం తగ్గించాలని తన కాన్వాయ్ అధికారులను ఆదేశించారు. ఆ అంబులెన్స్ కు దారివ్వాలని సూచించారు. దాంతో ఆ అంబులెన్స్ ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన ముందుకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.