APPSC: గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీపీఎస్సీ... రూ.93 వేల వరకు వేతనం!

APPSC issues notification for gazetted posts
  • మొత్తం పోస్టులు 25
  • టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల భర్తీకి ప్రకటన
  • డిసెంబరు 8 నుంచి దరఖాస్తులు
  • కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపిక
ఏపీలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ కమిషనర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య 25 అని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ గెజిటెడ్ ఉద్యోగాలకు అర్హులు. వేతనం రూ.29,760 నుంచి రూ.93,780 వరకు చెల్లిస్తారు.

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వయసు 21 నుంచి 28 ఏళ్లు.... అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు 28 నుంచి 42 ఏళ్లు... ఇతర పోస్టులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఉద్యోగార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. psc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా డిసెంబరు 8 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
APPSC
Gazetted Posts
Notification
Andhra Pradesh

More Telugu News