Tomato: పెట్రోల్ ను దాటేసిన టమాట రేటు.. ఏపీలో కిలో రూ.130

Tomato Prices At High On The Sky

  • సగటున రూ.104కు అమ్ముతున్న వ్యాపారులు
  • వంటల్లో టమాట కోటాకు కోత
  • హోటళ్లలోనూ పక్కకు
  • రెండు నెలల్లో పది రెట్లు పెరిగిన ధరలు
  • భారీ వర్షాలతో తగ్గిన దిగుమతులు

సామాన్యుడిని టమాట రేట్లు ఠారెత్తిస్తున్నాయి. వాటిని కొనాలంటేనే జనాలు జంకుతున్నారు. దీంతో చాలా మంది వంటల్లో టమాట కోటాను తగ్గించేశారు. హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. టమాట వెరైటీలకు ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు. ఏపీలో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలికింది. ఇవాళ ఉదయం నుంచి సగటున కిలో టమాట రూ.104కు అమ్ముడవుతోంది. టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు టమాట చట్నీకి రాంరాం చెప్పారు.

పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని వ్యాపారులు అంటున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం వరకు కిలో టమాట రూ.10 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. భారీ వర్షాలు పడడం, ట్రాన్స్ పోర్ట్ కు ఆటంకాలు ఏర్పడడం వంటి కారణాలతో టమాటల రాక తగ్గిపోయింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు వేరే కూరగాయల ధరలూ బాగా పెరిగాయి.

  • Loading...

More Telugu News