PM Narendra Modi: నోయిడా ఎయిర్ పోర్టు... ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోదీ భూమిపూజ

 PM Modi laid foundation stone for Noida International Airport

  • గ్రేటర్ నోయిడాలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం
  • రూ.10,050 కోట్లతో తొలిదశ పనులు
  • 2024 నాటికి అందుబాటులోకి విమానాశ్రయం
  • ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయం

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో ఆసియాలోనే అతి పెద్దదైన విమానాశ్రయం నిర్మించనున్నారు. గౌతమ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్ ప్రాంతంలో నిర్మిస్తున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు భూమిపూజ చేశారు.

దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో ఉండే ఈ విమానాశ్రయం విస్తీర్ణం 1,300 హెక్టార్లు. రూ.10,050 కోట్లతో తొలి దశ పనులు చేపడుతున్నారు. మరో మూడేళ్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయం అవుతుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News