Andhra Pradesh: మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

AP govt files affidavit in High Court in Amaravathi case

  • బిల్లుల రద్దును ఏపీ అసెంబ్లీ ఆమోదించిందని అఫిడవిట్ లో పేర్కొన్న ప్రభుత్వం
  • బిల్లు రద్దు కాపీలను కోర్టుకు సమర్పించిన ప్రభుత్వం
  • తగు ఉత్తర్వులను వెలువరించాలని కోర్టును కోరిన వైనం

మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. రద్దు చేసిన బిల్లులను ఈ నెల 22న అసెంబ్లీ ఆమోదించిందని అఫిడవిట్ లో ప్రభుత్వం తెలిపింది. ఇదే బిల్లులను ఈనెల 23న  శాసనమండలిలో కూడా ఆమెదించామని వెల్లడించింది.

వికేంద్రీకరణ బిల్లులపై స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పాలని ఇటీవలే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లులను రద్దు చేసినట్టు రెండు బిల్లుల కాపీలను అఫిడవిట్ కు జతచేసి హైకోర్టుకు సమర్పించారు. బిల్లులను చట్ట సభల్లో రద్దు చేసిన నేపథ్యంలో... తగు ఉత్తర్వులను వెలువరించాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది.

  • Loading...

More Telugu News