Heavy Rains: తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు... సీఎం స్టాలిన్ సమీక్ష

Heavy rains lashes Tamilandu

  • ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు
  • తమిళనాడులో మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్
  • మధురైలో ఇళ్లలోకి వర్షపు నీరు
  • రేపు 15 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ

బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, నాగపట్టణం జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. మధురై నగరంలో కురిసిన కుండపోత వానకు ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేపు 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తమిళనాడులో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని పేర్కొంది.

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెన్నైలో 91 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News