Andhra Pradesh: టమాటా ధర ఢమాల్.. పత్తికొండ మార్కెట్లో కిలో రూ.30

tomato rate downfall in andhra pradesh

  • మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెరిగిన టమాటాల దిగుమతి
  • అనంతపురంలో రూ. 55, కృష్ణాలో రూ. 60 చొప్పున విక్రయం
  • టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

పెట్రోలు ధరలతో పోటీ పడుతూ జనాలను భయపెట్టిన టమాటా ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో 100 రూపాయలు పలికిన టమాటా ధర రాత్రికి రాత్రే కుప్పకూలింది. ప్రస్తుతం రూ. 30 లకు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటాలు దిగుమతి అవుతుండడంతోనే ధర తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

టమాటా ధర ఆకాశాన్నంటడంతో రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని నిర్ణయించింది. అనంతపురంలో రైతుల నుంచి రూ. 50 చొప్పున కొనుగోలు చేసి మార్కెట్లో రూ. 55  చొప్పున విక్రయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కిలో టమాటా ధర రూ. 60 పలుకుతోంది.

  • Loading...

More Telugu News