Sharmila: పారాసిటమాల్ వేసుకుంటే చాల‌ని ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారు.. ఇప్పుడైనా మారండి: ష‌ర్మిల‌

sharmila slams kcr

  • కరోనా సెకండ్‌ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేవు
  • బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేదు
  • జనం పిట్టల్లా రాలిపోయారు
  •  కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆరోగ్య శ్రీ ద్వారా కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడాల‌ని ఆమె కోరారు.

'కరోనా సెకండ్‌ వేవ్ లో డాక్టర్లుంటే బెడ్స్ లేక, బెడ్స్ ఉంటే ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతుంటే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన దొరగారు కనీసం ఇప్పుడైనా చేతులు కాలినంక ఆకులు పట్టుకోకుండా ప్రజల ప్రాణాలను కాపాడండి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి' అని ష‌ర్మిల చెప్పారు.

'కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల‌ని చెప్పి చేతులు దులుపుకుని వ‌దిలేయ‌కుండా కరోనా వైద్యం ఉచితంగా అందేలా చూడండి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. ప్రతి ఒక్కరికి కరోనా రెండు డోసులు వ్యాక్సిన్ అందేలా చెయ్యండి. గతంలో కరోనాతో ఇల్లు గుల్లయిన కుటుంబాలకు కరోనా వైద్య బిల్లులు చెల్లించండి' అని ష‌ర్మిల కోరారు.

  • Loading...

More Telugu News