Lok Sabha: లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం.. వాయిదా

lok sabha adjourns

  • ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ్యుల ప‌ట్టు
  • ఈ రోజు మ‌ధ్యాహ్నానికి స‌భ‌ను వాయిదా వేసిన  లోక్‌స‌భ స్పీక‌ర్
  • అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధ‌మ‌న్న మోదీ

పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమై, వాయిదా ప‌డ్డాయి. ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల స‌భ్యులు ప‌ట్టుబ‌ట్ట‌డంతో లోక్‌స‌భ స్పీక‌ర్ ఈ రోజు మ‌ధ్యాహ్నానికి స‌భ‌ను వాయిదా వేశారు. అలాగే, ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతికి సంతాపం తెలుపుతూ రాజ్య‌సభ చైర్మ‌న్ కూడా స‌భ‌ను గంట సేపు వాయిదా వేశారు.  

ప్రధాని మోదీ పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. ఉభయ సభలు ఆటంకాలు లేకుండా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయ‌న చెప్పారు. సమావేశాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధ‌మ‌ని తెలిపారు. ఆయా అంశాల‌పై పార్లమెంటులో చర్చించి, అన్ని ప్రక్రియలు సజావుగా కొనసాగేలా చూడాలని కోరారు.

క‌రోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. కాగా, ఈ పార్ల‌మెంటు సమావేశాల్లో సుమారు 26 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. కొత్త‌ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును మొదటి రోజే ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News