YS Vivekananda Reddy: వైయస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్
- వివేకా హత్యతో తనకు సంబంధం లేదంటూ అనంతపూర్ ఎస్పీని కలిసిన గంగాధర్ రెడ్డి
- సీబీఐ, సునీతలు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఫిర్యాదు
- రక్షణ కల్పించాలని విన్నపం
మాజీ మంత్రి వైయస్ వివేకానంద హత్య అంశంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ హత్యతో తనకు సంబంధం లేదని గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించారు. రూ. 10 కోట్ల సుపారీ తీసుకుని వైఎస్ అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలు వివేకాను తనతో హత్య చేయించినట్టు చెప్పాలని వివేకా కుమార్తె సునీత, సీబీఐ, మడకశిర ఎస్సై, సీఐ శ్రీరామ్ లు తనను వేధిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వీరి వల్ల తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని... తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఎస్పీ స్పందించారు. గంగాధర్ రెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని... విచారణ అధికారిగా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని చెప్పారు. గంగాధర్ కు, ఆయన కుటుంబానికి రక్షణ కల్పించామని తెలిపారు.