Andhra Pradesh: రూ.వెయ్యి కోట్లిచ్చి ఆదుకోండి.. కేంద్రానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

Give Rs 1000 crore Assistance Immediately Vijaya Sai Reddy Requests Center In Rajya Sabha

  • రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా రిక్వెస్ట్
  • వర్షాలతో రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడి
  • డ్యామ్ లు, రోడ్లు, రైలు పట్టాలు కొట్టుకుపోయాయని కామెంట్
  • లక్షల ఎకరాల్లో పంట మునిగిందని వివరణ

భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలమైందని, రూ.6,054 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇవాళ రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా ఆయన వరదలపై మాట్లాడారు. తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లను విడుదల చేసి ఏపీని ఆదుకోవాలని కోరారు. అసాధారణ వర్షాలతో 44 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 16 మంది ఆచూకీ దొరకలేదని వెల్లడించారు.

నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను వర్షాలు ముంచెత్తాయని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, రైలు పట్టాలు, కరెంట్ స్తంభాలు కొట్టుకుపోయాయన్నారు. కొన్ని డ్యామ్ లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని, భారీగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 9 నుంచి 16 ఏళ్ల వయసు వారికి అమెరికాలోలాగానే మన దేశంలోనూ డెంగ్యూ వ్యాక్సిన్ ను తీసుకొస్తున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News