Nara Lokesh: దారి మళ్లించిన రూ. 1,309 కోట్లను వెంటనే పంచాయతీల ఖాతాలలో జమ చేయాలి: నారా లోకేశ్

Funds taken from panchayats to be given back says Nara Lokesh
  • పంచాయతీలకు కేంద్ర ఇచ్చిన నిధులను దోపిడీదారుల్లా తరలించుకుపోయారు
  • రాష్ట్రానికి సీఎం ఎంతో.. గ్రామానికి సర్పంచ్ అంతే
  • పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణమని అన్నారు.

మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతేనని చెప్పారు. సర్పంచులను ఆటబొమ్మలను చేసి పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Panchayats
Funds

More Telugu News