KCR: ఆయన సాహిత్య ప్రస్థానం మూడున్నర దశాబ్దాల పాటు సాగింది: కేసీఆర్
- సిరివెన్నెల మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే సాహిత్యాన్ని సృష్టించారని కితాబు
- ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటు అన్న కేసీఆర్
ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సిరివెన్నెల సృష్టించారని కొనియాడారు. పండిత, పామరుల హృదయాలను ఆయన గెలుచుకున్నారని చెప్పారు.
సినిమా పేరునే (సిరివెన్నెల) తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం... సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటు అన్నారు. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.