Sirivennela: పాట పూర్తయింది .. పాఠం మధ్యలో ఆగిపోయింది గురూజీ: మారుతి

Maruthi Condolences to Sirivennela

  • మీ పాటలే మేము నేర్చుకున్న పాఠాలు
  • భరించలేని నిజాలు చెవులు వింటున్నాయి
  • మనసు ఒప్పుకోవడం లేదు
  • ఆవేదన వ్యక్తం చేసిన మారుతి

సిరివెన్నెల కలానికి పరిగెత్తడం మాత్రమే తెలుసు .. మనసు మైదానంలో భావాలను వెదజల్లడం తెలుసు. ఆయన పాటలు సరస శృంగారాలనే కాదు ..  జీవన వేదాన్ని .. జీవన సారాన్ని ఆవిష్కరిస్తాయి. అనుభవాలనే నైవేద్యంగా అందిస్తాయి. ఆయన ప్రతి పాట తెలుగు సినిమా సంపాదించుకున్న ఆస్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

'జగమంతా కుటుంబం నాది .. ఏకాకి జీవితం నాది' అంటూ, ఒక మహాగ్రంథమంతటి విషయాన్ని ఆయన ఒకే ఒక్క లైన్లో చెప్పారు. అలాంటి గొప్ప కవి .. రచయిత సిరివెన్నెల మరణం అందరినీ తీవ్రమైన ఆవేదనకు గురిచేస్తోంది. ఇండస్ట్రీ ప్రముఖులంతా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.

తాజాగా దర్శకుడు మారుతి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "మీ పాటలే మేము నేర్చుకున్న పాఠాలు .. మీ సూక్తులు మేము రాసుకునే మాటలు .. బ్రహ్మ ఒక్కడే కష్టపడుతున్నాడని సాయంగా ఇంత తొందరగా వెళ్లిపోయారా? నా పాటను పూర్తిచేసి వెళ్లిపోయారు .. కానీ పాఠం మధ్యలోనే వదిలేశారు గురూజీ. భరించలేని నిజాన్ని చెవులు వింటున్నాయి .. కానీ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు" అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News