Sajjanar: సిరివెన్నెలను ఈ వారంలో కలవాలనుకున్నా.. ఇంతలోనే ఇలా..: సజ్జనార్

Sajjanar pays tributes to Sirivennela
  • సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళి అర్పించిన సజ్జనార్
  • రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో మంచి అనుబంధం ఉందన్న సజ్జనార్
  • పోలీసుల మీద మంచి పాటలు రాశారని వ్యాఖ్య
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ... గత రెండేళ్ల నుంచి సిరివెన్నెల గారితో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. సమాజం పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. కరోనా సమయంలో పోలీసుల మీద మంచి పాటలు రాశారని కొనియాడారు. ఈ వారంలో ఆయనను తాను కలవాలనుకున్నానని... కానీ, ఇంతలోనే ఆయన అందరికీ దూరమయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. తన తరపున, ఆర్టీసీ సిబ్బంది తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
Sajjanar
Sirivennela
Tollywood

More Telugu News