Cylinders: వాణిజ్య సిలిండర్ పై మరోసారి భారీగా ధరల పెంపు

Commercial Cylinders Cost Rs 100 more

  • వాణిజ్య సిలిండర్ పై రూ.100.50 పెంచిన చమురు సంస్థలు
  • ఢిల్లీలో రూ.2,101కు చేరిన ధర
  • రెండు నెలల్లో రూ.367 పెంపు

వాణిజ్య సిలిండర్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇవాళ రూ.100.50 దాకా పెంచి చమురు సంస్థలు షాకిచ్చాయి. ఇవాళ్టి నుంచే పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. ఇప్పటికే 19 కిలోల సిలిండర్ రూ.2 వేలుండగా.. పెంచిన ధరతో అది రూ.2,101కి చేరింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి రూ.1,734గా ఉన్న వాణిజ్య సిలిండర్ ధర.. నవంబర్ 1న రూ.2,000.50కి పెరిగింది.

ఇప్పటి పెంపుతో కలిపి కేవలం రెండు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధర రూ.367 పెరిగింది. దీంతో హోటళ్లు, రోడ్లపై బండి పెట్టుకుని ఆహార పదార్థాలు విక్రయించే వాళ్లు.. రేట్లను పెంచేశారు. తాజాగా పెరిగిన ధరలతో సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ.2,101, కోల్ కతాలో రూ.2,174, ముంబై రూ.2,051, చెన్నైలో రూ.2,234కు చేరాయి.

  • Loading...

More Telugu News