Virat Kohli: దక్షిణాఫ్రికా పర్యటనపై కోహ్లీ స్పందన
- ఒమిక్రాన్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్ పై నీలినీడలు
- త్వరలోనే క్లారిటీ వస్తుందన్న కోహ్లీ
- బీసీసీఐతో టచ్ లో ఉన్నామని వ్యాఖ్య
న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టు ముంబైలో జరగనుంది. ఈ టెస్టులో కోహ్లీ ఆడనున్నాడు. దీంతో, జట్టుతో పాటు కోహ్లీ చేరాడు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా టూర్ పై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి బీసీసీఐతో టచ్ లో ఉన్నామని చెప్పారు. టూర్ పై త్వరలోనే తమకు క్లారిటీ వస్తుందని తెలిపారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కూడా ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకు టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాలి. ఈ టూర్ లో 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20లు ఆడాలి. ఒమిక్రాన్ వేరియంట్ మరింత విజృంభిస్తే ఈ టూర్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తాజా సమాచారం ప్రకారం టూర్ ను ఒక వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కోరినట్టు సమాచారం.