Gulam Nabi Azad: కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: గులాం నబీ అజాద్

Congress may not come into power says Gulam Nabi Azad

  • 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ 300 ఎంపీ సీట్లను గెలుచుకోవడం కష్టమే
  • కాంగ్రెస్ గెలుపు సాధ్యమయ్యేలా లేదు
  • అందుకు ఆర్టికల్ 370 రద్దుపై హామీ ఇవ్వలేను

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ అన్నారు. 300 ఎంపీ సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారాన్ని చేపట్టే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. 300 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందాలని తాను కోరుకుంటున్నానని... అయితే అది సాధ్యమయ్యేలా లేదని చెప్పారు.  జమ్మూకశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్ 370పై ఏన్నో ఏళ్ల నుంచి తానొక్కడినే మాట్లాడుతున్నానని... ప్రస్తుతం ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఆ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని గులాం నబీ అజాద్ అన్నారు. ఆర్టికల్ రద్దుపై వెనక్కి వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడం వల్ల ఆర్టికల్ రద్దుపై హామీ ఇవ్వలేనని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రంపై అన్ని పార్టీలు కలిసి ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు.

  • Loading...

More Telugu News