NGT: ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా వడ్డించిన ఎన్జీటీ

NGT imposes fine over Polavaram project

  • పోలవరం పరిధిలో మూడు ఎత్తిపోతల పథకాలు
  •  పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి పనులు
  • పర్యావరణ అనుమతులు తీసుకోలేదన్న ఎన్జీటీ
  • మూడు నెలల్లో జరిమానా చెల్లించాలని ఆదేశాలు

పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా వడ్డించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరం పరిధిలోని పురుషోత్త పట్నం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తున్నారంటూ రూ.120 కోట్ల జరిమానా విధించింది. ఇందులో పురుషోత్తపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి 73.6 కోట్లు జరిమానా విధిస్తూ ఎన్జీటీ నిర్ణయం తీసుకుంది.

ఈ జరిమానాలను 3 నెలల్లోగా కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని ఎన్జీటీ నిర్దేశించింది. పోలవరం పర్యావరణ అంశాలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యుడు వసంతకుమార్ గతంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News