Kiran Abbavaram: ఇలా జరుగుతుందని అనుకోలేదు: కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram
  • సోదరుడిని కోల్పోయిన కిరణ్ అబ్బవరం
  • తనని  పరిచయం చేయమని అడిగేవాడు
  • ఏదైనా సాధించాక చేయాలి అనుకున్నాను
  • ఇలా తన గురించి చెప్పాల్సి వస్తుందనుకోలేదు  
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరిగా కిరణ్ అబ్బవరం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు విడుదలైన తరువాత తన స్థాయి మరింత పెరుగుతుందని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఆయన సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయనను తలచుకుంటూ కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశాడు.

"ఒరేయ్ కిరా .. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా" అని మా బ్రదర్ రామాంజులు రెడ్డి అనేవాడు. తనకి వీలైనదానికంటే ఎక్కువగానే నన్ను సపోర్ట్ చేశాడు. తన సరదాలను .. సంతోషాలను నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నానని అనుకునేలోగా తను లేకుండా పోయాడు.

"అందరికీ నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావురా" అని అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు. ఏదైనా సాధించిన తరువాత పరిచయం చేద్దామని అనుకున్నాను. కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు .. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Kiran Abbavaram
Ramanjulu Redyy
Tollywood

More Telugu News