Navjot Singh Sidhu: అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట నిరసనకు దిగిన సిద్ధూ

Sidhu protests in front of CM Arvind Kejriwal residence

  • త్వరలో పంజాబ్ లో ఎన్నికలు
  • పంజాబ్ లో ఆప్ నేతల దూకుడు
  • సిద్ధూ కౌంటర్
  • ఢిల్లీలో కాంట్రాక్టు టీచర్లతో కలిసి సీఎం ఇంటి వద్ద ధర్నా

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు తరచుగా రాష్ట్రానికి వస్తూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ఎదురుదాడికి దిగారు. ఇవాళ ఢిల్లీలో సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట సిద్ధూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఇవాళ కాంట్రాక్టు టీచర్లు సీఎం ఇంటివద్ద ధర్నాకు ఉపక్రమించారు. వారితో కలిసి సిద్ధూ కూడా నిరసన తెలిపారు. టీచర్లతో కలిసి నినాదాలు చేశారు.

అంతేకాదు, పంజాబ్ లో కొత్త రీతిలో ఉండే విద్యా వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్న ఆప్ ను ట్విట్టర్ లోనూ ఏకిపారేశారు. "2015 ఎన్నికల నాటి మేనిఫెస్టోలో 8 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 20 కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ ఉద్యోగాలు, ఆ కాలేజీలు ఏవి?" అని సిద్ధూ ప్రశ్నించారు. "మీరు ఢిల్లీలో కేవలం 440 ఉద్యోగాలు ఇచ్చారు. గత ఐదేళ్లలో ఢిల్లీలో నిరుద్యోగిత ఐదు రెట్లు పెరిగింది" అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యా వ్యవస్థను కాంట్రాక్ట్ విధానం అని సిద్ధూ అభివర్ణించారు.

  • Loading...

More Telugu News