Peddireddi Ramachandra Reddy: బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

AP Minister Peddireddy visits Puneet Rajkumar family members
  • ఇటీవల పునీత్ రాజ్ కుమార్ మృతి
  • గుండెపోటుకు గురైన కన్నడ స్టార్ హీరో
  • తీవ్ర విషాదంలో పునీత్ కుటుంబం
  • పునీత్ అర్ధాంగి అశ్వినిని పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
ఇటీవల కన్నడ చిత్రసీమ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు బెంగళూరులో పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లారు. పునీత్ అకాలమరణంతో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పునీత్ మరణ వార్త వ్యక్తిగతంగా తనను ఎంతో విచారానికి గురిచేసిందని అన్నారు. వయసుకు చిన్నవాడే అయినా సామాజిక సేవలో ఎంతో ఎత్తుకు ఎదిగాడని కొనియాడారు. ఆపన్నుల పాలిట మానవతావాది అని కీర్తించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి... పునీత్ అర్ధాంగి అశ్విని రాజ్ కుమార్ కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Peddireddi Ramachandra Reddy
Puneet Rajkumar
Demise
Bengaluru
Andhra Pradesh
Karnataka

More Telugu News