Arvind Kejriwal: భయపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తగా ఉండండి: కేజ్రీవాల్
- ఢిల్లీలో నమోదైన ఒమిక్రాన్ కేసు
- టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్
- అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేయాలని కేజ్రీవాల్ సూచన
ఒమిక్రాన్ కేసు ఢిల్లీలో నమోదైన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో ప్రవేశించినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని... అయితే మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెప్పారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్ ఉన్నట్టు తేలింది.
మరోవైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ, ఒమిక్రాన్ వైరస్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 27 మందిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వీరిలో 17 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని... మిగిలిన వారు వారికి కాంటాక్టులోకి వచ్చినవారని చెప్పారు. వీరిలో 12 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని... వీరిలో ఒకరికి ఒమిక్రాన్ అని తేలిందని వెల్లడించారు.