Britain: బ్రిటన్‌లో మొదలైన ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి.. 336 కేసుల నమోదు
- కొత్త కేసుల్లో ఎవరికీ లేని అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర
- సామాజిక వ్యాప్తికి ఇది అద్దం పడుతోందన్న మంత్రి
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
దక్షిణాఫ్రికాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు బ్రిటన్ను భయపెడుతోంది. అక్కడ ఇప్పటికే సామాజిక వ్యాప్తి మొదలైంది. దేశంలో ఇప్పటి వరకు 336 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు ఆ దేశ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కొత్త కేసుల్లో ఎవరికీ అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని, దీనిని బట్టి సామాజిక వ్యాప్తి మొదలైనట్టు అర్థం చేసుకోవచ్చని అన్నారు.
అయితే, ఈ వేరియంట్ ప్రమాదకారా? కాదా? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. ఈ వేరియంట్‌పై టీకాలు ఎంతమేరకు పనిచేస్తాయన్న విషయం కూడా స్పష్టంగా తెలియదన్నారు. శాస్త్రవేత్తలు దీనిపై ఓ నిర్ధారణకు వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ తాము వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.