iaf: హెలికాప్ట‌ర్ బ్లాక్ బాక్స్ ల‌భ్యం.. ప్ర‌మాదానికి కార‌ణాలు వెల్ల‌డ‌య్యే ఛాన్స్‌

black box recovered by Air Force officials from the spot

  • ప్ర‌మాద స్థ‌లికి 30 అడుగుల దూరంలో ల‌భ్యం
  • బ్లాక్ బాక్స్‌లో పైల‌ట్ల సంభాష‌ణ‌లు రికార్డ‌య్యే అవ‌కాశం
  • దాన్ని స్వాధీనం చేసుకున్న  అధికారులు

సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదానికి కార‌ణాల‌పై అధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. హెలికాప్ట‌ర్ లోని బ్లాక్ బాక్స్‌లో పైల‌ట్ల సంభాష‌ణ‌లు రికార్డ‌య్యే అవ‌కాశం ఉంటుంది.

బ్లాక్ బాక్స్ కోసం అధికారులు, సిబ్బంది గాలించ‌గా వారికి ప్ర‌మాద స్థ‌లికి 30 అడుగుల దూరంలో అది ల‌భ్య‌మైంది. దాన్ని వైమానిక ద‌ళ‌ అధికారులు స్వాధీనం  చేసుకున్నారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాద ద‌ర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీల‌కం కానుంది. ప్ర‌మాదానికి కార‌ణాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు, కూలిపోయిన హెలికాప్ట‌ర్ కు సంబంధించిన మ‌రిన్ని పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య‌ మధులికా రావత్ అంత్యక్రియలను రేపు ఢిల్లీలోని కంటోన్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

ఈ రోజు సాయంత్రం వారి మృత‌దేహాల‌ను సైనిక విమానంలో ఢిల్లీకి తరలిస్తారు. ఈ మేరకు అధికార వర్గాలు ఓ ప్ర‌క‌ట‌న చేశాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం రావ‌త్ మృత‌దేహాన్ని ఉంచ‌నున్నామ‌ని వివ‌రించారు.

  • Loading...

More Telugu News