Donkey Milk: లీటర్ గాడిద పాలు రూ. 10 వేలకు కొంటున్నారు.. ఎందుకో తెలుసా..?

People purchasing liter donkey milk for 10000 to use as medicine for corona

  • మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో గాడిద పాల విక్రయం
  • ఒక టీస్పూన్ పాలు రూ. 100
  • పాలు కొనేందుకు ఎగబడుతున్న జనాలు

గాడిద పాలు తాగితే రోగ నిరోధకశక్తి పెరుగుతుందనే నమ్మకం చాలామందిలో ఎప్పటి నుంచో ఉంది. పుట్టిన పిల్లలకు గాడిద పాలను తాగించడాన్ని మనం చాలా చోట్ల ఎప్పటి నుంచో చూస్తున్నాం కూడా. ఇప్పుడు ఇదే నమ్మకం గాడిదలు ఉన్నవారికి కాసుల వర్షం కురిపిస్తోంది. గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కరోనాను ఎదుర్కోవచ్చని పాల విక్రేతలు ప్రచారం చేస్తున్నారు.

మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో పెద్ద స్థాయిలో గాడిద పాల వ్యాపారం జరుగుతోంది. వీధివీధికి తిరుగుతూ గాడిద పాలను విక్రయిస్తున్నారు. ఒక టీస్పూన్ పాలను రూ. 100కు, లీటర్ పాలను రూ. 10 వేలకు అమ్ముతున్నారు. జనాలు కూడా ఈ పాలను కొనేందుకు ఎగబడుతున్నారు. అయితే గాడిద పాలతో ఇన్ఫెక్షన్లు నయం కావడం అసాధ్యమని, ఇలాంటి వదంతులను నమ్మి మోసపోవద్దని వైద్యులు చెపుతున్నారు. డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News