Balakrishna: దుమ్మురేపుతున్న 'అఖండ'.. తొలి వారం కలెక్షన్లు ఎంతంటే..!

First week collections of Balakrishna movie Akhanda
  • ఘన విజయం సాధించిన బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ
  • తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.49 కోట్ల షేర్
  • ప్రపంచ వ్యాప్తంగా రూ. 87.90 కోట్ల గ్రాస్ వసూలు
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అందరి అంచనాలకు తగ్గట్టే వీరి హ్యాట్రిక్ సినిమా 'అఖండ' ఘన విజయం సాధించింది. కరోనాతో డీలా పడ్డ టాలీవుడ్ లో ఈ సినిమా కొత్త జోష్ ను నింపింది. తొలివారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ముందుకు సాగుతోంది.

'అఖండ'కు భారీ స్థాయిలో రూ . 53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో మంచి బిజినెస్ చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 44.11 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.82 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 4.56 కోట్లు వసూలు చేసింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.49 కోట్ల షేర్, రూ. 87.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరో రూ. 51 లక్షలు వస్తే ఈ సినిమా హిట్ చిత్రంగా నిలుస్తుంది. అంతేకాదు మరో రూ. 12 కోట్ల గ్రాస్ సాధిస్తే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరుతుంది. ఈ వారం వచ్చే కలెక్షన్లతో బాలయ్య 'అఖండ' రూ. 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేయబోతోంది.
Balakrishna
Boyapati Sreenu
Akhanda Movie
First Week
Collections

More Telugu News