Gaali Vaana: జీ5లో మరో ఆసక్తికర వెబ్ సిరీస్... రాధిక, సాయికుమార్ ప్రధానపాత్రల్లో 'గాలివాన'

Radhika and Saikumar starring in Gaali Vaana original series
  • బ్రిటీష్ డ్రామాకు తెలుగు రూపం..  'గాలివాన'
  • శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఒరిజినల్ సిరీస్
  • బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ సంయుక్త నిర్మాణం
  • జీ5 యాప్ లో మరో వైవిధ్యభరిత సిరీస్
ఏదో ఒక జాన‌ర్‌కు మాత్రమే ప‌రిమితం కాకుండా... అన్ని తరహాల సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ జీ5 ఓటీటీ దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమాను విడుదల చేసింది. ప్రజల్ని చైతన్యపరిచే కథతో రూపొందిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అంతేకాకుండా మధ్య తరగతి కుటుంబ నేపథ్యంతో జీ 5 విడుదల చేసిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' తండ్రీకొడుకుల అనుబంధాన్ని, కుటుంబ బంధాలను ఆవిష్కరించి అశేష ప్రజాదరణను పొందింది. ఇప్పుడు మరో కొత్త ఒరిజినల్ సిరీస్ నిర్మాణానికి 'జీ 5' శ్రీకారం చుట్టింది.

నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వామ్యంతో బీబీసీ స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి 'గాలివాన‌' అనే ఒరిజినల్ సిరీస్ గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం.
Gaali Vaana
Original Series
ZEE5
Radhika
Saikumar
OTT

More Telugu News