Mahesh Babu: హైదరాబాదులోని ఖరీదైన ప్రాంతంలో ప్లాటు కొనుగోలు చేసిన మహేశ్ బాబు!

Mahesh Babu bought plot in Hyderabad
  • జూబ్లీహిల్స్ లో ప్లాటు కొనుగోలు
  • 1,442 చదరపు గజాల స్థలం కొనుగోలు
  • రూ.26 కోట్లకు డీల్
  • జాతీయ మీడియాలో కథనం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హైదరాబాదు నగరంలో ఓ ప్లాటు కొనుగోలు చేశారు. నగరంలో ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ లో రూ.26 కోట్లతో 1,442 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

ఈ స్థలం యర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తికి చెందినది. ఈ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూలగొట్టిన విక్రాంత్ రెడ్డి కొత్త భవనం నిర్మించాలని భావించినా, తన నిర్ణయాన్ని మార్చుకుని మహేశ్ బాబుకు స్థలాన్ని అమ్మేశారు. దీనికి సంబంధించిన డీల్ గత నెల 17న కుదిరినట్టు తెలుస్తోంది.
Mahesh Babu
Plot
Jubilee Hills
Hyderabad
Tollywood

More Telugu News