Hyderabad: శిల్పా చౌదరికి ముగిసిన మూడు రోజుల కస్టడీ.. ఆ ముగ్గురికి రూ.7 కోట్లు తిరిగి ఇచ్చేస్తానని ఒప్పుకోలు!

Shilpa Chowdary three days police Custody ends

  • పోలీసు విచారణలో పలు విషయాల వెల్లడి
  • రాధికారెడ్డికి రూ. 10 కోట్లు ఇచ్చినట్టు చెప్పినా లేని ఆధారాలు
  • శిల్ప, ఆమె భర్త ఖాతాల్లో రూ. 20 వేలు కూడా లేని వైనం
  • వారి మోసాలపై మరింత లోతుగా విచారణ

పలువురు ప్రముఖులను కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న శిల్పా చౌదరి.. ముగ్గురి నుంచి వసూలు చేసిన ఏడు కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేస్తానని పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. మూడు రోజుల నార్సింగ్ పోలీసు కస్టడీలో శిల్ప పలు విషయాలను వెల్లడించింది.

దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డి నుంచి శిల్ప రూ.7 కోట్లకుపైగా తీసుకుని మోసం చేసినట్టు ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడా డబ్బును వెనక్కి ఇచ్చేందుకు శిల్ప అంగీకరించింది. కాగా, రాధికారెడ్డికి తాను రూ. 10 కోట్లకు పైగానే ఇచ్చినట్టు శిల్ప చెప్పినప్పటికీ అందుకు తగిన ఆధారాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమె చేసిన మోసాలపై పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

శిల్ప గతంలో అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ఖాతాలో రూ. 16 వేలు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14 వేలు ఉండడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కాగా, మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు నేడు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

  • Loading...

More Telugu News