Mepma: టీకాలు వేయించుకోలేదో.. రేషన్, పింఛన్లు కట్: మెదక్ జిల్లాలో మెప్మా సిబ్బంది హెచ్చరిక

Mepma and Asha Workers Campaign for vaccination in medak

  • నర్సాపూర్‌లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన మెప్మా, ఆశా కార్యకర్తలు
  • భయం వీడి వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచన
  • వ్యాక్సిన్ వేయించుకున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు

కరోనా టీకా రెండు డోసులు తీసుకోకుంటే రేషన్, పింఛన్లు నిలివేస్తామని హెచ్చరిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. టీకాలు వేసుకుంటే కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండవచ్చని, టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదని చెబుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.

దేశంలో ఇప్పటికే కోట్లాదిమంది టీకాలు తీసుకున్నారని, కాబట్టి భయం వీడి వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఇందులో భాగంగా టీకాలు తీసుకున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు.

  • Loading...

More Telugu News