Jakka Leelavati: ఎమ్మెల్యే జోగి రమేశ్ తో నా కుటుంబానికి ప్రాణహాని ఉంది... వైసీపీ మహిళా నేత ఆరోపణ

YCP leader Jakka Leelavati fires on MLA Jogi Ramesh
  • పెడన ఎమ్మెల్యేపై వైసీపీ నేత జక్కా లీలావతి తీవ్ర ఆరోపణలు
  • తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వెల్లడి
  • తన భర్తకు మత్తుమందు పెట్టారని ఆరోపణ
  • అక్రమ కేసులతో వేధించారని వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేశ్ పై సొంత పార్టీకి చెందిన మహిళా నేత తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ కృత్తివెన్ను మండల వైసీపీ నేత జక్కా లీలావతి ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి జోగి రమేశ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

తన భర్త ప్రదీప్ కుమార్ కృత్తివెన్ను మండలంలోని పడితడిక గ్రామసర్పంచ్ గా ఉన్నారని, తన భర్తకు ఎమ్మెల్యే జోగి రమేశ్, మరికొందరితో మత్తుమందు పెట్టించి తమ వైపు తిప్పుకున్నారని వివరించారు. గతంలో తనపైనా, తన భర్తపైనా కేసులు పెట్టి వేధించారని జక్కా లీలావతి వాపోయారు. ఇప్పుడు చంపేస్తామని బెదిరిస్తున్నారని వెల్లడించారు.
Jakka Leelavati
MLA Jogi Ramesh
Krithivennu
Pedana
Krishna District
YSRCP
Andhra Pradesh

More Telugu News