vvs lakshman: టీమిండియా భవిష్యత్ కోసం పాటుపడతా: వీవీఎస్ లక్ష్మణ్
- ఎన్‌సీఏ కొత్త చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
- నిన్న బాధ్యతల స్వీకరణ
- కొత్త సవాళ్ల కోసం తాను ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
కొత్త సవాళ్ల కోసం తాను ఎదురుచూస్తున్నానని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) కొత్త చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఎన్‌సీఏగా నిన్న బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. టీమిండియా భవిష్యత్ కోసం పాటుపడతానని చెప్పారు.
కాగా, ఎన్‌సీఏ చీఫ్‌గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా మారిన నేపథ్యంలో ఎన్‌సీఏ బాధ్యతలు లక్ష్మణ్‌కు దక్కాయి. ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. గతంలో ఆ బాధ్యతల్లో ఉన్న రాహుల్ ద్రవిడ్ చాలా మంది యువ ఆటగాళ్లను మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దాడు.
అంతకుముందు రాహుల్ ద్రవిడ్ అండర్-19తో పాటు ఇండియా-ఏ జట్లకు కూడా కోచ్‌గా ఉన్నారు. ఇప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ భారం అంతా లక్ష్మణ్‌పై పడింది. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ కుటుంబం సహా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.