Kinjarapu Ram Mohan Naidu: కులగణన చేస్తే బీసీ జనాభా ఎంతుందో తెలుస్తుంది: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu demands for BC Sensus
  • బీసీ కులగణన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన
  • కులగణన సాధించేంత వరకు మీవెంటే ఉంటానన్న రామ్మోహన్ నాయుడు
  • టీడీపీకి బీసీలు వెన్నెముకగా నిలిచారని వ్యాఖ్య
కులగణన చేస్తే దేశంలో బీసీ జనాభా ఎంత ఉందో తెలుస్తుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. బీసీ కులగణన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులకు ఈరోజు రామ్మోహన్ నాయుడు సంఘీభావం ప్రకటించారు. బీసీ కులగణన సాధించేంత వరకు తాను మీవెంటే ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా నిలిచారని తెలిపారు. బీసీలకు అండగా అన్ని పార్టీల నేతలు మద్దతుగా నిలవడం సంతోషకరమని చెప్పారు. బీసీల కార్యక్రమం ఎక్కడ జరిగినా తన తండ్రి ఎర్రన్నాయుడు ముందుండేవారని అన్నారు. ప్రతి సందర్భంలో పార్లమెంటులో బీసీల సమస్యలపై టీడీపీ ఎంపీలుగా పోరాడామని చెప్పారు.
Kinjarapu Ram Mohan Naidu
Telugudesam
BC Sensus

More Telugu News