Employees: సజ్జలతో ముగిసిన ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- నిన్న సీఎంకు నివేదిక సమర్పించిన సీఎస్ కమిటీ
- పీఆర్సీ ఇతర అంశాలపై ప్రతిపాదనలు
- ఉద్యోగుల అసంతృప్తి
- సజ్జలతో నేడు చర్చలు
ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్సీ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎస్ కమిటీ నివేదికపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఏపీ ఉద్యోగ సంఘాల నేతల నేడు సమావేశం అయ్యారు. ఈ చర్చలు ముగిసిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులు కోరుతున్న విధంగా 45 శాతం పీఆర్సీ సాధ్యం కాదని సీఎస్ కమిటీ పేర్కొందని వెల్లడించారు.
కొవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, అయినప్పటికీ ఉద్యోగులకు అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎస్ కమిటీ సిఫారసులు చేసిందని వెల్లడించారు. ప్రతిపాదిత ఫిట్ మెంట్ (14.29%)ను పెంచే అవకాశం ఉందని కూడా సజ్జల వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు.