IAF: హెలికాప్ట‌ర్ ప్రమాదంలో తీవ్ర‌గాయాల‌పాలైన కెప్టెన్‌ వ‌రుణ్ సింగ్ కూడా మృతి

IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh
  • తమిళనాడులో ఈ నెల 8న హెలికాప్టర్ ప్రమాదం
  • ఇన్నిరోజులుగా బెంగ‌ళూరులోని క‌మాండ్ ఆసుప‌త్రిలో చికిత్స‌
  • క‌న్నుమూశారని భార‌త వాయుసేన అధికారిక ప్ర‌క‌ట‌న‌
తమిళనాడులో ఈ నెల 8న‌ జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య‌ మధులికా రావత్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్ర‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డి ఇన్నిరోజులుగా బెంగ‌ళూరులోని క‌మాండ్ ఆసుప‌త్రిలో ప్రాణాల‌తో పోరాడిన కెప్టెన్ వ‌రుణ్ సింగ్ నేడు క‌న్నుమూశారు.

ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ప్రతిక్షణం ప‌ర్య‌వేక్షిస్తూ, మెరుగైన చికిత్స అందించిన‌ప్ప‌టికీ ప్రాణాలు కాపాడ‌లేక‌పోయారు. కెప్టెన్ వ‌రుణ్ సింగ్ మృతిని భార‌త వాయుసేన అధికారికంగా ప్ర‌క‌టించింది.  

'ఈ నెల 8న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో గాయాల‌పాలై ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోన్న కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ఈ రోజు ఉద‌యం ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు భార‌త వాయుసేన సంతాపం తెలుపుతోంది' అని భార‌త వాయుసేన ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలుస్తామ‌ని పేర్కొంది.
IAF
India

More Telugu News