Amaravati: తిరుపతిలో అమరావతి రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు
- మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభకు పర్మిషన్
- ఈ నెల 17న జరగనున్న రైతుల సభ
అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించాలనుకున్న బహిరంగసభకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహిరంగసభకు సంబంధించి ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. రైతుల తరపున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ వాదనలు వినిపించగా... ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ సభ జరిగితే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని సుధాకర్ రెడ్డి కోర్టుకు వివరించారు.
అయితే, ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు రైతుల సభకు అనుమతి మంజూరు చేసింది. తిరుపతి రూరల్ పరిధిలో సభ నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ నెల 17న రైతులు తిరుపతిలో సభను నిర్వహించనున్నారు.