Allu Arjun: పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ఇప్పుడు కలవను: అల్లు అర్జున్

I dont meet Puneet Rajkumar family now says Allu Arjun
  • 'పుష్ప' సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరుకు వెళ్లిన బన్నీ
  • ప్రమోషన్ కోసం వచ్చి.. పునీత్ ఇంటికి వెళ్లడం తనకు ఇష్టం ఉండదని వ్యాఖ్య
  • త్వరలోనే వారి కుటుంబాన్ని కలుస్తానని వ్యాఖ్య
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప' సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల మీడియాలతో ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. ఈరోజు బెంగళూరులో కన్నడ మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇటీవలే కన్నుమూసిన పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకున్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పుడు బెంగళూరుకు వచ్చినా ఆయన కుటుంబాన్ని కలవనని... ప్రస్తుతం తాను సినిమా ప్రమోషన్ కోసం వచ్చానని... ఇలాంటి సమయంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. త్వరలోనే మళ్లీ బెంగళూరుకు వచ్చి పునీత్ కుటుంబాన్ని కలుస్తానని తెలిపారు.
Allu Arjun
Tollywood
Pushpa
Puneet Rajkumar

More Telugu News