GHMC: ఆ విషయాన్ని నిరూపించండి.. చెవి కోసుకుంటా: హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
- బీజేపీ కార్పొరేటర్లను కలవడం లేదనే విషయాన్ని నిరూపించండి
- అన్ని పార్టీల కార్పొరేటర్లకు నేను అందుబాటులో ఉన్నా
- కార్పొరేటర్లు, అధికారుల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నా
బీజేపీ కార్పొరేటర్లను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆమె స్పందిస్తూ అన్ని పార్టీల కార్పొరేటర్లకు తాను అందుబాటులో ఉన్నానని చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లకు దూరంగా ఉన్నానని నిరూపిస్తే తన చెవి కోసుకుంటానని అన్నారు.
మేయర్ ఛాంబర్ పై బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు దాడి చేయడంపై ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లకు అందుబాటులో ఉండటం లేదని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... అందుకే జోన్లవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నానని చెప్పారు. కొర్పొరేటర్లు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించి వారి మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకుని పోతానని చెప్పారు.