Omicron: వచ్చే రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది: యూరోపియన్ హెల్త్ కమిషనర్

Omicron spreads faster than Delta Variant

  • డెల్టా కంటే వేగంగా విస్తరిస్తోన్న ఒమిక్రాన్
  • అమెరికా మొత్తం కేసుల్లో మూడు శాతం ఒమిక్రాన్ కేసులే
  • 75 దేశాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్

గత ఏడాది ప్రపంచాన్ని వణికించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈరోజు వెల్లడించింది. అమెరికాలో ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని తెలిపింది. మిగిలిన కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ రకానికి చెందినవని చెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయని సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ తెలిపారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్ ను డామినేట్ చేసే ఆధిపత్య జాతిగా ఒమిక్రాన్ పురోగమిస్తుందని హెచ్చరించారు. 2022 తొలి రెండు నెలల్లో ఒమిక్రాన్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ తెలిపారు. పండుగ సమయాల్లో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News