Hyderabad: వేల దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా ఓఆర్ఆర్.. మంత్రి కేటీఆర్ షేర్ చేసిన ఫొటోలివిగో

ORR Glitters In Thousands Of LED Lamps

  • నిన్న 190.5 కిలోమీటర్ల పొడవున 13,009 ఎల్ఈడీ లైట్ల ప్రారంభం
  • 6,340 స్తంభాల ఏర్పాటు.. రూ.100.22 కోట్ల ఖర్చు
  • మొత్తంగా 270.5 కిలోమీటర్ల పొడవునా 18,220 లైట్లు

వేల దీపాల వెలుగుల్లో ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు) దేదీప్యమానంగా వెలిగిపోయింది. రాత్రిపూట ప్రయాణించేవారు భద్రంగా వెళ్లేందుకు ఉపకరిస్తూనే.. దీపాల మణిహారంతో రోడ్డంతా అందంగా మెరిసిపోయింది. రెండో దశలో భాగంగా నిన్న పటాన్ చెరు పరిధి నుంచి 190.5 కిలోమీటర్ల పొడవున రూ.100.22 కోట్ల వ్యయంతో 13,009 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. వాటి కోసం 6,340 స్తంభాలను పెట్టారు. వీటిని మంత్రి కేటీఆర్ నిన్న ప్రారంభించారు. మొత్తంగా రెండు దశల్లో కలిపి ఓఆర్ఆర్ పై 270.5 కిలోమీటర్ల పొడవునా 9,706 స్తంభాలు పెట్టి.. 18,220 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలను కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


 

  • Loading...

More Telugu News