RTC Bus: జల్లేరువాగు బస్సు ప్రమాద ఘటనలో కొత్త విషయం వెల్లడి

RTC Bus rams into a stream due to steering problem

  • పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన
  • వాగులో పడిన బస్సు
  • 9 మంది దుర్మరణం
  • ఘటనను వివరించిన ప్రత్యక్ష సాక్షి

పశ్చిమ గోదావరి జిల్లాలోని జల్లేరువాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది మృతి చెందడం తెలిసిందే. జంగారెడ్డిగూడెం వద్ద బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి వాగులో పడిపోయిందని ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో సోమశేఖరరెడ్డి అనే వ్యక్తి తన కుమారుడితో పాటు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఆయన కుమారుడికి గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలో సోమశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జరిగిన ఘటనను వివరించారు. బస్సు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా స్టీరింగ్ పట్టేసిందని తెలిపారు. బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడని, అయితే స్టీరింగ్ తిరగలేదని వివరించారు. దాంతో బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొట్టి వాగులో పడిపోయిందని వెల్లడించారు. బస్సు డ్రైవర్ నీళ్లలో ఊపిరాడక మరణించాడని, తమను స్థానికులు రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నామని సోమశేఖరరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News