PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ముగిసిన సింధు పోరాటం

Sindhu loses to Tai Tzu Ying in World Badminton Championship
  • స్పెయిన్ లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్
  • క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి
  • వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో పరాజయం
  • అనవసర తప్పిదాలు ఎక్కువగా చేసిన సింధు
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ నుంచి నిష్క్రమించింది. స్పెయిన్ లోని హెల్వా నగరంలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్ సింధు మహిళ సింగిల్స్  క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ తో పోరులో సింధు 17-21, 13-21తో వరుస గేముల్లో పరాజయం చవిచూసింది. చైనీస్ తైపేకి చెందిన టాప్ సీడ్ తై జు యింగ్ కు తొలి గేములో ఓ మోస్తరు పోటీ ఇచ్చిన సింధు... రెండో గేములో తీవ్రంగా నిరాశపర్చింది. ప్రత్యర్థి ఆటతీరు కంటే సింధు అనవసరంగా చేసిన తప్పిదాలే ఆమె ఓటమికి దారితీశాయి.
PV Sindhu
Tai Tzu Ying
Quarterfinal
World Badminton Championship
Huelva
Spain
India

More Telugu News